తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ విమోచన దినోత్సవం డిమాండ్ తో నిర్మల్ లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో విమోచన ఉత్సవాలు జరపనందుకు కేసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వీరులు పైనుంచి చూస్తున్నారని.. ప్రగతి భవన్ కు బీజేపీ జయధ్వానాలు వినిపించాలన్నారు.
తెలంగాణ వీరుల చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకే నిర్మల్ లో సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు బండి. ఉద్యమ సమయంలో విమోచన ఉత్సవాలు జరపాలని కేసీఆర్ డిమాండ్ చేసిన విషయం గుర్తులేదా..? అని ప్రశ్నించారు. పోరాటాలతో రాష్ట్రంలో కుటుంబ, గడీల పాలనను బద్ధలు కొడదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం కదిలి రావాలన్నారు.
సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ పాకిస్తాన్ లో కలిసి ఉండేదన్నారు బండి సంజయ్. ఆయన లేకుంటే అసలు తెలంగాణ వచ్చేదే కాదని.. కేసీఆర్ సీఎం అయ్యేవారే కాదని సెటైర్లు వేశారు.