• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » కేసీఆర్ సర్కారుపై బండి ఆర్‌టీఐ అస్త్రం

కేసీఆర్ సర్కారుపై బండి ఆర్‌టీఐ అస్త్రం

Last Updated: July 6, 2022 at 2:49 pm

  • టీఆర్ఎస్ ప్రభుత్వంపై బిజెపి దూకుడు
  • యుద్దం మొదలు..అక్రమాల వెలికితీతకు సిద్ధం..
  • ఏకంగా 88 ఆర్‌టీఐ దరఖాస్తులు..
  • కేసీఆర్ హామీలు, వైఫల్యాల వివరాల సేకరణ
  • ప్రజాకోర్టులో నిలదీసేలా కార్యాచరణ

బిజెపి తెలంగాణ శాఖ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో దూకుడు పెంచింది. ఆర్‌టీఐ ఆయుధంగా 8 ఏండ్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగట్టేందుకు ఏకంగా 88 దరఖాస్తులను దాఖలు చేశారు బిజెపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్. సీఎం కేసీఆర్‌ వివిధ సందర్భాల్లో శాసనసభ, శాసనమండలి, రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా ఇచ్చిన హామీలు, 2014, 2018 టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, ఆర్థికశాఖ, రెవెన్యూ, ఎసిబి, సంక్షేమ, పంచాయతీరాజ్‌, సాగునీటి, విద్యా, వైద్య శాఖలకు దరఖాస్తులు దాఖలు చేశారు. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ మోసాలు, వైఫల్యాలను ఆధారాలతో సహా పకడ్భందీగా ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టేందుకు ఆర్‌టీఐ ద్వారా దరఖాస్తులు మంజూరు చేశారు.

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ధరఖాస్తులను ఆర్‌టీఐ ద్వారా దాఖలు చేయాలని, పార్టీకి అనుబంధంగా ఉన్న యువమోర్చాలు, పార్టీ రాష్ట్రనాయకులు వివిధ అంశాలపై ఆర్‌టీఐ ద్వారా ధరఖాస్తులు చేసి ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచాలని బిజెపి వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్‌రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం వందలకోట్లు ఖర్చుచేసి దేశంలోని వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ప్రకటనల వివరాల కోసం ధరఖాస్తు చేశారు. తాజాగా
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆర్‌టిఐ ద్వారా 88 దరఖాస్తులను గత నెల 28వ తేదీన ఆర్‌టిఐ ద్వారా సమాచారం కోరుతూ వివిధ ప్రభుత్వశాఖల్లో ధరఖాస్తులు దాఖలు చేశారు. ఆర్‌టీఐ ద్వారా బండి సంజయ్‌ కోరిన సమాచారం వివరాలు…

1) 2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 వరకు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా, వివిధ సమావేశాల్లో, సభల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీల వివరాలు ఇప్పించగలరు. 2) 2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 వరకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు? ఎన్ని నెరవేర్చలేదు? ఎన్ని పెండింగ్‌లో వున్నాయి? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు. 3) ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శాసనసభ, శాసనమండలిలో వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలు వివరాలను ఇప్పింగలరు. 4) శాసనసభ, శాసనమండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు అయ్యాయి? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు. 5) 2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఎన్నిసార్లు ఇప్పటివరకు రాష్ట్ర సచివాలయానికి వచ్చి తమ విధులను నిర్వర్తించారో పూర్తి సమచారాన్ని ఇప్పించగలరు. 6) ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు 2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 వరకు ఎన్ని రోజులు హైదరాబాదులోని అధికార నివాసంలో బసచేశారు, ఎన్నిరోజులు వ్యవసాయక్షేత్రంలో బసచేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు. 7) ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారిక నివాసం ప్రగతి భవన్‌ నిర్మాణానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు. 8) ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతిభవన్‌ నిర్మాణం పనులు ఎప్పుడు ప్రారంభించారు? ఎప్పుడు పూర్తిచేశారు? వీటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు. 9) 2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం ఎన్ని నోటిఫికేషన్లు జారీ చేసింది? ఈ నోటిఫికేషన్లు ఎన్ని ఖాళీల భర్తీ కోసం విడుదల చేశారు? వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు. 10) 2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు ఎన్ని ఉద్యోగఖాళీలు భర్తీచేసింది? ఎంత మందికి కొత్త వారు ఉద్యోగాల్లో చేరారు? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు. 11) 2 జూన్‌ 2014 నుండి 30 మే 2022 వరకు ఎంత మంది ఉద్యోగులు రిటైర్‌ అయ్యారు? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు? 12) బిస్వాల్‌ కమిటి రిపోర్ట్‌ ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఉద్యోగఖాళీలు ఉన్నాయి? దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు. 13) బిస్వాల్‌ కమిటి రిపోర్టుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? దానికి సంబంధించిన యాక్షన్‌టేకెన్‌ రిపోర్డును ఇప్పించగలరు. 14) 2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఉపాధ్యాయ పోస్టులను ఇప్పటి వరకు భర్తీచేసింది? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పించగలరు. 15) ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని ఉపాధ్యాయ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు. 16) 2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని రాష్ట్రాల్లో పర్యటించారు? ఆ పర్యటనలకు ఎంత ఖర్చు అయింది? వీటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు. 17) 2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పర్యటనలకు ప్రైవేట్‌ విమానాలను వినియోగించారా? లేక రెగ్యులర్‌ విమానాల్లోనే ప్రయాణించారా? వీటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు. 18) ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు వివిధ రాష్ట్రాలో పర్యటించినప్పుడు ప్రభుత్వ అతిథి గృహాల్లో ఉన్నారా? లేక ప్రైవేట్‌ హోటళ్లల్లో బస చేశారా? వీటికి సంబంధించి పూర్తి సమాచారన్ని ఇప్పించగలరు. 19) 2 జూన్‌ 2014 నుండి 30 మే 2022 వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు తీసుకున్న జీతభత్యాలు ఎంత? దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పించగలరు. 20) 2 జూన్‌ 2014 లో తెలంగాణలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో నీటిపారుదల వ్యవస్థల ద్వారా ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంత సాగునీరు అందిందో నియోజకవర్గాల వారీగా ఇప్పించగలరు. 21) 25 జూన్‌ 2022 నాటికి తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నీటిపారుదల వ్యవస్థ ద్వారా ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంత సాగునీరు అందుతుందో నియోజకవర్గాల వారీగా ఇప్పించగలరు. 22) 2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు తెలంగాణలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించారో నియోజకవర్గాల వారీగా సమాచారాన్ని ఇప్పించగలరు. 23) ఎస్సీ, ఎస్టీ పేదలకు 2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 వరకు ఎంత మందికి భూపంపిణి చేశారు? ఒక్కొక్కరికి ఎంత భూమి ఇచ్చారు? దీనికి సంబంధించి పూర్తిసమాచారాన్ని జిల్లాల వారిగా ఇప్పించగలరు. 24) 2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 వరకు ఎస్సీ, ఎస్టీ పేదలకు భూపంపిణీకి ఎన్ని నిధులు కేటాయించారు. అందులో ఎన్ని నిధులు దీనికోసం ఖర్చు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు. 25) 2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 వరకు ఎస్సీ, ఎస్టీ, సామాజికవర్గాల వారు భూమి కోసం ఎంత మంది ధరఖాస్తు చేశారు? అందులో ఎంతమంది అర్హులు ఉన్నారు? వీరిలో ఎంతమందికి భూమి కేటాయించారు? ఇంకా ఎన్ని ధరఖాస్తులు పెండిరగ్‌లో ఉన్నాయి? 26) 2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 వరకు రాష్ట్రంలో ఎన్ని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ప్రభుత్వం నిర్మించింది. దీనికి సంబంధించి పూర్తిసమాచారాన్ని జిల్లాల వారిగా ఇప్పించగలరు. 27) 2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 వరకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లకోసం ఎంత మంది ధరఖాస్తు చేసుకున్నారు? అందులో ఎంత మంది అర్హుల ఉన్నారు? అందులో ఎంత మందికి డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లు కేటాయించారు? ఇంకా ఎన్ని ధరఖాస్తులు పెండిరగ్‌లో ఉన్నాయి? దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని జిల్లాలవారిగా ఇప్పించగలరు. 28) 2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 వరకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు నిర్మాణానికి ఎంత బడ్జెట్‌ ప్రభుత్వం కేటాయించింది? అందులో ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు? సంవత్సరాలవారిగా పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు? 29) 10 డిసెంబర్‌ 2018 నాటికి లక్ష రూపాయలు రుణమాఫీ పొందడానికి ఎంతమంది రైతులకు అర్హత ఉంది. అందులో ఎంత మంది రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ చేశారు? దీనికి సంబంధించిన పూర్తిసమాచారాన్ని జిల్లాల వారిగా ఇప్పించగలరు. 30) 10 డిసెంబర్‌ 2018 నుండి 25 జూన్‌ 2022 వరకు రాష్ట్రప్రభుత్వం ఎంతమంది రైతులకు లక్షరూపాయల రుణమాఫీ చేసింది. దీనికి సంబంధించి పూర్తిసమాచారాన్ని జిల్లాల వారిగా ఇప్పించగలరు. 31) లక్ష రూపాయల రైతురుణమాఫీ కోసం 2018 నుండి 2022 వరకు ఎంత బడ్జెట్‌ కేటాయించారు? అందులో ఇప్పటివరకు ఎంత ఖర్చుచేశారు? దీనికి సంబంధించిన పూర్తిసమాచారాన్ని ఇప్పించగలరు? 32) 2 జూన్‌ 2014 నుండి 2022 వరకు బీసీలకు కేటాయించిన నిధులు ఎన్ని? అందులో చేసిన ఖర్చు ఎంత? దీనికి సంబంధించి పూర్తిసమాచారాన్ని సంవత్సరాల వారిగా ఇప్పించగలరు. 33) 2 జూన్‌ 2014 నుండి 2022 వరకు బీసీలకు కేటాయించిన నిధులను దేనికోసం ఖర్చుచేశారు? దానికి సంబంధించిన పూర్తిసమాచారాన్ని ఇప్పించగలరు. 34) సబ్సిడీ రుణాలకోసం బీసీసామాజిక వర్గాలకు చెందినవారు 2014 నుండి 2022 వరకు ఎంత మంది ధరఖాస్తు చేశారు? అందులో ఎంత మందికి రుణాలు మంజూరు చేశారు? జిల్లాల వారీగా ఇప్పించగలరు. 35) బీసీ సామాజికవర్గాలకు సబ్సిడీ రుణాల కోసం 2014 నుండి 2022 వరకు ఎంత బడ్జెట్‌ కేటాయించారు? అందులో ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు? సంవత్సరాలవారీగా సమాచారాన్ని ఇప్పించగలరు. 36) తెలంగాణ రాష్ట్రంలో ఎం.బి.సి. కార్పోరేషన్‌కు 2014 నుండి 2022 వరకు కేటాయించిన నిధులు ఎంత? అందులో ఖర్చుచేసింది ఎంత? దీనికి సంబంధించి పూర్తిసమాచారాన్ని సంవత్సరాల వారీగా ఇప్పించగలరు. 37) ఎం.బి.సి. కార్పోరేషన్‌ ద్వారా ఏ కార్యక్రమాల కోసం ఈ నిధులు ఖర్చు చేశారు? దానికి సంబంధించిన పూర్తిసమాచారాన్ని ఇప్పించగలరు? 38) 2 జూన్‌ 2014 నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పులు ఎంత? ఆదాయం ఎంత? వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు? 39) 2 జూన్‌ 2014 నుండి 30 మే 2022 వరకు ప్రభుత్వం చేసిన అప్పులెంత? ఈ అప్పులకు నెలకు వడ్డీ ఎంత చెల్లిస్తున్నారు? ఈ అప్పులు ఏఏ ఆర్థిక సంస్థలనుండి తీసుకున్నారు? వీటికి సంబంధించి పూర్తిసమాచారాన్ని ఇప్పించగలరు? 40) 2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది సలహాదారులను నియమించింది? వారికి ఇస్తున్న జీతభత్యాలు ఎంత? దీనికి సంబంధించి పూర్తివివరాలను ఇప్పించగలరు? 41) రాష్ట్ర ప్రభుత్వం నియమించుకున్న సలహాదారులు ఇప్పటివరకు ఎన్నిసలహాలు ఇచ్చారు? అందులో ఎన్ని పాటించారు? వారు ఎవరికి సలహాలిస్తున్నారు? దీనికి సంబంధించి పూర్తివివరాలను ఇప్పించగలరు? 42) 2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు రాష్ట్రంలో కొత్తగా ఎన్ని సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులను ఎన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం ప్రారంభించింది? దీనికి సంబంధించి పూర్తిసమాచారాన్ని జిల్లాల వారిగా ఇప్పించగలరు. 43) 2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు రాష్ట్రంలో కొత్తగా ఎన్ని మండలాల్లో 30 పడకల ఆసుపత్రులను ప్రభుత్వం ప్రారంభించింది? దీనికి సంబంధించి పూర్తిసమాచారాన్ని మండలాల వారీగా ఇప్పించగలరు. 44) 2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు రాష్ట్రంలో కొత్తగా ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 పడకల ఏరియా ఆసుపత్రులను ప్రభుత్వం ప్రారంభించింది? దీనికి సంబంధించి పూర్తిసమాచారాన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇప్పించగలరు. 45) 2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు తెలంగాణలో ప్రభుత్వం కొత్తగా ఎన్ని ఇంజనీరింగ్‌ కళాశాలలు ప్రారంభించింది? వీటికి సంబంధించి సమాచారాన్ని జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇప్పించగలరు. 46) 2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాలిటెక్నిక్‌ కళాశాలలను ప్రభుత్వం ప్రారంభించింది? దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు. 47) జూన్‌ 2, 2014 నుండి జూన్‌ 1, 2021 వరకు ఎంఎల్‌ఏలు, ఎంపీలు, ఎంఎల్‌సీలు, ఇతర ప్రజా ప్రతినిధుల భూ కబ్జాలకు, భూ ధందాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారికి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? వాటిపైన ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు. 48) ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో, ఇతర ప్రచార మాధ్యమాల్లో జూన్‌ 2, 2014 నుండి జూన్‌ 1, 2021 వరకు ఎంఎల్‌ఏలు, ఎంపీలు, ఎంఎల్‌సీలు, ఇతర ప్రజా ప్రతినిధుల భూ కబ్జాలకు, భూ ధందాలకు పాల్పడినట్లు వచ్చిన వార్తలు ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చాయా? వస్తే వాటీపై ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు ఏమిటి? దానికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించగలరు. 49) జూన్‌ 2, 2014 నుండి జూన్‌ 1, 2021 వరకు ఎంఎల్‌ఏలు, ఎంపీలు, ఎంఎల్‌సీలు, ఇతర ప్రజా ప్రతినిధుల భూ కబ్జాలకు, భూ ధందాలకు పాల్పడినట్లు వచ్చిన వార్తలపై, ఫిర్యాదులపై ముఖ్యమంత్రి గారు కలెక్టర్‌లు, అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్‌ శాఖ ద్వారా ఎమైనా దర్యాపు చేయించారా? చేయిస్తే దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు. 50) హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో భూ ఆక్రమణకు సంబంధించి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఎస్‌.కె. సిన్హా నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించిందా? నియమిస్తే దానికి సంబంధించిన జీవో ఇప్పించగలరు. 51) రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఎస్‌.కె. సిన్హా నేతృత్వంలో కమిటీకి ప్రభుత్వం చేసిన ఖర్చు ఎంత? దాని పూర్తి వివరాలు సమర్పించగలరు. 52) రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఎస్‌.కె. సిన్హా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో భూ ఆక్రమణకు సంబంధించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారా? సమర్పిస్తే ఎప్పుడు సమర్పించారు? ఆ నివేదికపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు. 53) తెలంగాణ రాష్ట్రంలో 2 జూన్‌ 2014 నాటికి రాష్ట్రంలో ఉన్న మొత్తం రేషన్‌కార్డుల సంఖ్య ఎంత? ఈ వివరాలను జిల్లాల వారీగా ఇప్పించగలరు. 54) 2 జూన్‌ 2022 నాటికి రాష్ట్రంలో ఉన్న మొత్తం రేషన్‌కార్డుల సంఖ్య ఎంత? ఈ వివరాలను జిల్లాలవారీగా ఇప్పించగలరు. 55) రాష్ట్రంలో కొత్తరేషన్‌కార్డుల కోసం ఎన్ని ధరఖాస్తులు పెండిరగ్‌లో ఉన్నాయి. ఆ ధరఖాస్తులను ఎప్పటిలోగా పరిశీలించి కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేస్తారు? 56) 2 జూన్‌ 2014 నుండి 2 జూన్‌ 2022 వరకు ఎన్ని రేషన్‌కార్డులను ప్రభుత్వం రద్దు చేసింది? రద్దుకు కారణాలేమిటి? రద్దుకు అవలంభించిన విధానాలు ఏమిటి? దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందజేయగలరు. 57) మీ సేవ సెంటర్లు కొత్త రేషన్‌కార్డు ధరఖాస్తులను జూన్‌ 2021 నుంచి ఆమోదించడం లేదు. మీ సేవ సెంటర్లకు కొత్తధరఖాస్తులను ఆమోదించవద్దని ప్రభుత్వం ఏమైనా ఉత్తర్వులు జారీచేసిందా? దీనికి సంబంధించిన పూర్తిసమాచారాన్ని మాకు ఇప్పించగలరు? 58) కేంద్ర ప్రభుత్వం నుండి ఉచితంగా ఇస్తున్న రేషన్‌ బియ్యానికి పాలిష్‌కొట్టి బహిరంగ మార్కెట్‌లో కొంతమంది రైస్‌మిల్లర్లు విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి ఏమైనా వచ్చిందా? వస్తే దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి? 59) రాష్ట్రంలోని వివిధ రైస్‌మిల్లులు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌తోపాటు (సి.ఎం.ఆర్‌), కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు ఎఫ్‌.సి.ఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా నివేదిక ఇచ్చారా? ఇస్తే ఆ నివేదిక పై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి? 60) రైస్‌మిల్లులు పాల్పడిన అక్రమాలపై ఎఫ్‌.సి.ఐ అధికారులు ఇచ్చిన నివేదిక కాపీలను మాకు అందజేయగలరు. 61) తెలంగాణ రాష్ట్రంలో 2 జూన్‌ 2014 నాటికి ఎంత మంది వృద్దులు, వితంతువులు, వికలాంగులుకు పించన్లు పొందుతున్నారు. ఈ వివరాలను జిల్లాల వారీగా ఇప్పించగలరు. 62) 2 జూన్‌ 2022 నాటికి ఎంతమంది వృద్దులు, వితంతువులు, వికలాంగులు పించన్లు పొందుతున్నారు. ఈ వివరాలను జిల్లాలవారీగా ఇప్పించగలరు. 63) రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతువులు, వికలాంగుల కొత్త పింఛన్ల కోసం ఎన్ని ధరఖాస్తులు పెండిరగ్‌లో ఉన్నాయి. ఆ ధరఖాస్తులను ఎప్పటిలోగా ఆమోదిస్తారు? కొత్త పింఛన్లను ఎప్పటినుంచి అమలు చేస్తారు? 64) ప్రస్తుతం రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు పింఛన్లు మంజూరు చేస్తున్నారా? చేస్తే ఎప్పటినుంచి అమలు చేస్తున్నారు? దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందజేయగలరు. 65) ధరణీ పోర్టల్‌ కోసం ప్రభుత్వం ఎన్నినిధులు ఖర్చు చేసింది?ఈ పోర్టల్‌ను ఎవరు రూపొందించారు? వీటికి సంబంధించి పూర్తివివరాలను ఇప్పించగలరు. 66) భూముల సమస్యలపై ఇప్పటి వరకు రాష్ట్రంలో ధరణిపోర్టల్‌లో ఎంత మంది ధరఖాస్తు చేసుకున్నారు? అందులో ఎన్ని ధరఖాస్తులను పరిష్కరించారు? వీటికి సంబంధించి పూర్తిసమాచారాన్ని జిల్లాలవారీగా ఇప్పించగలరు. 67) 2 జూన్‌ 2014 నుండి 25 జూన్‌ 2022 వరకు రాష్ట్రంలో ఎంతమంది మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం ఇండ్లు, ఇళ్ళస్థలాలు కేటాయించింది? దీనికి సంబంధించి పూర్తిసమాచారాన్ని జిల్లాలవారీగా ఇప్పించగలరు. 68) రాష్ట్రంలో తెలంగాణ జర్నలిస్ట్‌భవన్‌ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని నిధులు కేటాయించింది? స్థలం ఎక్కడ కేటాయించింది? ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు? వీటికి సంబంధించి పూర్తిసమాచారాన్ని ఇప్పించగలరు. 69) రాష్ట్రంలో గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు ప్రస్తుతం ఇస్తున్న జీతాలు ఎంత? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు. 70) గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్‌, సర్వీస్‌ క్రమబద్దీకరణ చేసే ప్రతిపాదనలు ప్రభుత్వానికేమైనా ఉందా? ఉంటే ఎప్పటిలోగా ఇవి పూర్తిచేస్తారు? దీనికి సంబంధించిన పూర్తిసమాచారాన్ని ఇప్పించగలరు. 71) 2 జూన్‌ 2014 నుండి 2022 వరకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు కేటాయించిన నిధులు ఎన్ని? అందులో చేసిన ఖర్చు ఎంత? దీనికి సంబంధించి పూర్తిసమాచారాన్ని సంవత్సరాల వారిగా ఇప్పించగలరు. 72) 2 జూన్‌ 2014 నుండి 2022 వరకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద కేటాయించిన నిధులను దేనికోసం ఖర్చుచేశారు? దానికి సంబంధించిన పూర్తిసమాచారాన్ని ఇప్పించగలరు. 73) ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్‌ నిర్మాణానికి ప్రభుత్వం ఎంతఖర్చు చేసింది? వాటికి సంబంధించిన పూర్తిసమాచారాన్ని ఇప్పించగలరు? 74) ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతిభవన్‌ నిర్మాణం పనులు ఎప్పుడు ప్రారంభించారు? ఎప్పుడు పూర్తిచేశారు? వీటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇప్పించగలరు? 75) గ్రామీణ పేదరిక నిర్మూలనశాఖ (సెర్ఫ్‌)లో ఎంతమంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు? దీనికి సంబంధించి పూర్తిసమాచారాన్ని జిల్లాలవారీగా ఇప్పించగలరు. 76) గ్రామీణ పేదరిక నిర్మూలనశాఖ (సెర్ఫ్‌) లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరణ చేసే ఆలోచన ప్రభుత్వం వద్ద ఏమైనా ఉందా? ఉంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పించగలరు. 77) గ్రామీణ పేదరికనిర్మూలనశాఖ (సెర్ఫ్‌) లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరణ చేసే ఆలోచన ప్రభుత్వం వద్ద ఏమైనా ఉందా? ఉంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పించగలరు. 78) రాష్ట్రంలోని వివిధ గ్రామపంచాయతీలకు 2014 నుండి 2022 వరకు రాష్ట్రప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది? దీనికి సంబంధించి సంవత్సరాలవారీగా, జిల్లాలవారీగా సమాచారం ఇప్పించగలరు. 79) రాష్ట్రంలోని వివిధ గ్రామపంచాయతీలకు 2014 నుండి 2022 వరకు రాష్ట్రప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది? దీనికి సంబంధించి సంవత్సరాలవారీగా, జిల్లాలవారీగా సమాచారం ఇప్పించగలరు. 80) పల్లెప్రగతి పనుల కింద గ్రామపంచాయతీలు ఇప్పటివరకు ఎన్ని పనులు చేశారు? వీటికి ఎన్ని నిధులు అవసరం అవుతాయి? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పల్లెప్రగతి కింద చేసిన పనులకు ఎన్ని నిధులు కేటాయించింది? ఇంకా ఎన్ని నిధులు కేటాయించాల్సి వుంది? వీటికి సంబంధించి పూర్తిసమాచారాన్ని జిల్లాలవారీగా ఇప్పించగలరు. 81) 2014 నుంచి 2022 వరకు కేంద్రప్రభుత్వం నుండి గ్రామపంచాయతీలకు ఎన్నినిధులు వచ్చాయి? దీనికి సంబంధించిన పూర్తిసమాచారాన్ని జిల్లాల వారీగా ఇప్పించగలరు. 82) రాష్ట్రంలో పోడుభూముల పట్టాల సమస్య ఎన్ని జిల్లాల్లో ఉన్నది. 83) రాష్ట్రంలో పోడుభూములకు పట్టాలకోసం వచ్చిన ధరఖాస్తుల సంఖ్య ఎంత? జిల్లాలవారీగా వివరాలు తెలపండి. 84) పోడుభూముల హక్కు ధరఖాస్తులను ప్రభుత్వం పరిశీలించిందా? పరిశీలిస్తే ఎంతమందిని అర్హులుగా గుర్తించింది, జిల్లాల వారీగా వివరాలు తెలపండి. 85) 2006 అటవీ హక్కుల చట్టప్రకారం గిరిజనులకు రాష్ట్రంలో అందుతున్న సౌకర్యాలు ఏమిటి? 86) ఇప్పటికే గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడుభూముల్లో హరితహారం పేరుతో ఫారెస్ట్‌ అధికారులు మొక్కలు నాటుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నది. 87) పోడుభూముల్లో సాగుచేసుకుంటున్న గిరిజనులపై ఫారెస్ట్‌, ప్రభుత్వం అధికారులు ఎన్ని జిల్లాల్లో కేసులు నమోదు చేశారు? జిల్లాల వారీగా వివరాలు తెలపండి. 88) పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన మహిళలపై రెవెన్యూ, ఫారెస్టు అధికారులదాడులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను అందజేయగలరు.

మరి, బిజెపి తెలంగాణ శాఖ ఆర్ టీఐ దరఖాస్తు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

Primary Sidebar

తాజా వార్తలు

టికెట్‌ టెన్షన్‌.. కాంగ్రెస్‌ మల్లగుల్లాలు

కాంగ్రెస్ లో కలకలం.. పాల్వాయి స్రవంతి ఆడియో లీక్

వృద్దులు రాత్రి సమయాల్లో ఎందుకు ఎక్కువగా మరణిస్తారు…?

ఆల్కాహాల్ తాగే వారు బరువు ఎందుకు పెరుగుతారు…?

ఈడీ లిస్ట్..టార్గెట్ 19 !

హజరుకాని మంత్రి.. నాంపల్లి కోర్టుకు బదిలీ!

ఫీల్డ్ అసిస్టెంట్లకు శుభవార్త.. !

రాక్షసులు శివుడ్ని ఎందుకు పూజించేవారు…?

అది ఒరిజినల్ వీడియో కాదు… క్లారిటీ ఇచ్చిన ఎస్పీ..!

ఆడవారికి గుండెపోటు ఎందుకు తక్కువ…?

బ్లాక్ మ్యాజిక్ ద్వారా ప్రజల మద్దతు పొందలేరు..!

పెళ్ళిలో బాసికం ఎందుకు కడతారు…?

ఫిల్మ్ నగర్

పూర్ణ హగ్..ఇంతకీ అతనెవరంటే

పూర్ణ హగ్..ఇంతకీ అతనెవరంటే

దయచేసి క్షమించండి..బాయ్‌ కాట్‌ పై అమీర్‌ రియాక్షన్‌!

దయచేసి క్షమించండి..బాయ్‌ కాట్‌ పై అమీర్‌ రియాక్షన్‌!

బ్లాక్ పింక్ వారి బోర్న్ పింక్ వ‌చ్చేస్తోంది!!

బ్లాక్ పింక్ వారి బోర్న్ పింక్ వ‌చ్చేస్తోంది!!

జ‌ర జాగ్ర‌త్త‌గా మాట్లాడండి!!

జ‌ర జాగ్ర‌త్త‌గా మాట్లాడండి!!

వాటి నుంచి విశ్రాంతి తీసుకోవాల‌నుకుంటున్నా!!

వాటి నుంచి విశ్రాంతి తీసుకోవాల‌నుకుంటున్నా!!

ట్రేడ్ టాక్.. బాక్సాఫీస్ ను డామినేట్ చేసిన బింబి

ట్రేడ్ టాక్.. బాక్సాఫీస్ ను డామినేట్ చేసిన బింబి

ఐశ్వర్య రాయ్ పై బన్సాలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఐశ్వర్య రాయ్ పై బన్సాలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

హీరోయిన్ గా మాలాశ్రీ కూతురు

హీరోయిన్ గా మాలాశ్రీ కూతురు

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)