కూకట్ పల్లి అయ్యప్పస్వామి ఆలయంలో బీజేపీ నేత వడ్డేపల్లి రాజేశ్వరరావు నిర్వహిస్తున్న మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన ఆలయంలోని అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంజయ్ మాట్లాడుతూ.. సర్వేజనా సుఖినోభవంతు అని కోరుకునేది హిందూ ధర్మం.
హిందూ ధర్మం పాటించే వారిలో నిస్వార్థం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అందరూ బాగుండాలని కోరుకుంటారు …హిందూ ధర్మాన్ని హేళన చేసే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది.
హిందూ దేవుళ్లను , ధర్మాన్ని కించపరిచేందుకు తెలంగాణ రాష్ట్రం అడ్డాగా మారిందని అన్నారు.
పోలీసుల భద్రతలో హిందూ దేవుళ్లను కించపరుస్తున్నారు. హిందూ ధర్మాన్ని పాటించే వారిలో ఐక్యత లోపించటం వల్లే హిందూ ధర్మాన్ని, దేవుళ్లను అవహేళన చేస్తున్నారని పేర్కొన్నారు. హిందువులందరూ సంఘటితం కావాలి అని పిలుపునిచ్చారు.
హిందూ దేవుళ్లను, ధర్మాన్ని హేళన చేసి మాట్లాడితే హిందూ సమాజం ఊరుకోదని బండి సంజయ్ హెచ్చరించారు.