ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. పీవీ నరసింహారావుపై కేసీఆర్‌ది నకిలీ ప్రేమ మాత్రమేనని విమర్శించారు వర్థంతి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రాకపోవడం పీవీని అవమానించడమేనని ఆరోపించారు. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమే పీవీ జయంతి ఉత్సవాలు చేశారని అన్నారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు అయిపోయాయని.. అందుకే కేసీఆర్ బయటికి రావట్లేదని బండి మండిపడ్డారు.
అసలు సీఎం కేసీఆర్ ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదన్నారు బండి సంజయ్.7వ నిజాంను స్ఫూర్తిగా తీసుకుని కేసీఆర్ పాలన చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. నాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా, మలిదశ తెలంగాణ ఉద్యమంలో పీవీ పోరాటం చేశారని గుర్తు చేసిన బండి సంజయ్.. పీవీ స్ఫూర్తితో నేటి 8వ నిజాం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుందని అన్నారు. పీవీ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద బండి సంజయ్ అంతకుముందు అంజలి ఘటించారు.
గొప్ప రాజకీయ చతురతతో, విశిష్ట గుణసంపదతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన మహోన్నత శిఖరం మన పీవీ. దేశాన్ని రక్షించు, దేశాన్ని నిర్మించు అనే మాటకు కట్టుబడి జీవితకాలమంతా కృషి చేసిన రుషి శ్రీ పీ.వీ నరసింహారావు గారు. pic.twitter.com/uoqLVNkroC
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 23, 2020