ధాన్యం కొనుగోలు అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుబ్టారు. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రైతు ఎక్కడైనా ధాన్యం అమ్ముకోవచ్చని కేంద్ర తీసుకొచ్చిన చట్టాల్లో ఉందే తప్ప.. కొనుగోలు కేంద్రాలు తొలగించాలని ఎక్కడా లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ నిర్ణయం వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేసారు.
రైతులతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్..ఓ అబద్ధాల సీఎం అని రాష్ట్రంలో చర్చించుకుంటున్నారని విమర్శించారు. రైతు వేదికలను కేంద్రం నిధులతోనే నిర్మించారని.. వాటిని కొనుగోలు కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లతో రూ. 7 వేల కోట్ల ఎలా వచ్చిందో రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిందేనన్నారు సంజయ్.