బీజేపీ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర వాయిదా పడింది. మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ఈ నెల 15 నుంచి ఐదో విడత పాదయాత్ర చేపట్టాలని బండి సంజయ్ మొదట నిర్ణయించారు.
ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఈ రోజు ప్రకటించింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. పాదయాత్రను ఆయన వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే ఆయన నాలుగు విడతలుగా ప్రజా సంగ్రామ యాత్ర చేశారు.
సంగ్రామ యాత్రలో భాగంగా ఈ నెల 15 నుంచి ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేయాలని ఆయన భావించారు. కానీ మునుగోడు ఉప ఎన్నికలకు నగారా మోగడంతో యాత్ర వాయిదా పడింది. మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది.
ఈ క్రమంలో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో మునుగోడు శాసనసభ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఈ నెల 7న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది.