కరీంనగర్ లో చిక్కుకున్న కర్ణాటక కార్మికులకు అభయహస్తం అందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. శాతవాహన యూనివర్సిటీ వద్ద కర్ణాటక రాష్ట్రం,గుల్బర్గా కు చెందిన కార్మికుల దగ్గరకు వెళ్లి వారికి కావాల్సిన 11 రకాల నిత్యావసర సరుకులను అందించారు. పనుల కోసం వచ్చి కరోనా కర్ఫ్యూతో వారం రోజులుగా దినదిన గండంగా కార్మికులు గడుపుతున్నారు. లాక్ డౌన్ ముగిసే వరకు ఉండటానికి కావాల్సిన సదుపాయాలు సమకూరుస్తామని కార్మికులకు బండి సంజయ్ హామీ ఇచ్చారు.
కరోనా రక్కసిని తరిమికొట్టే వరకు ప్రజలు కొంత సంయమనం పాటించాలని సంజయ్ పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇచ్చిన పిలుపు మేరకు,ఫీడ్ ది నీడీ కార్యక్రమంలో భాగంగా పేదలకు భోజనం అందించారు. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ వల్ల ఎవరు ఇబ్బందులు పడకుండా బీజేపీ కార్యకర్తలు ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు.