హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ఉప్పుగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాళీమాత దేవాలయం భూములపై వివాదం మరింత వేడెక్కింది. సర్వే నెంబర్ 24, 25, 26లో ఏడు ఎకరాల 13 గుంటల భూమిపై ఘర్షణ నెలకొంది. పోలీసుల సమక్షంలో ప్రహరీ నిర్మాణాలను స్థానికులు, బీజేపీ నేతలు అడ్డుకున్నారు.
1951 నుంచి దేవాదాయశాఖ ఆధీనంలో భూమి ఉందని, ఆలయట్రస్ట్ తనకు భూమి అమ్మిందంటూ ఓ వ్యక్తి నిర్మాణాలు మొదలుపెట్టారు. పోలీసుల సాయంతో ఆలయస్థలంలో ఆ వ్యక్తి నిర్మాణాలు చేపట్టాడు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానికులకు మద్దతుగా ఎమ్మెల్యే రాజా సింగ్ ఆలయానికి వచ్చారు.
వీరికి మద్ధతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డబీర్ పురా పోలీస్ స్టేషన్ లో అరెస్టైన వారిని పరామర్శించనున్నారు.