కేంద్రం యాసంగికి సంబంధించి రా రైస్ కొనేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రం ఎందుకు వడ్లను కొనబోమంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు.కామారెడ్డి లోని పర్ణికా హోటల్ లో జరిగిన బీజేపీ జోనల్ సమావేశంలో పార్టీ జాతీయ సహ కార్యనిర్వాహక కార్యదర్శి శివప్రకాశ్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ సంస్థాగత నిర్మాణం పై దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎంపీలు ధర్మపురి అరవింద్,సోయం బాపూరావ్,ఎమ్యెల్యేలు ఈటల రాజేందర్,రఘునందన్ రావ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్,పార్టీ ప్రధానకార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి,దుగ్యాల ప్రదీప్,బంగారు శ్రుతి, ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీ నారాయణ,జోనల్ పరిధిలోని జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జీలు, మాజీ ఎంపీలు,ఎమ్యెల్యేలు పాల్గొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్,నిజామాబాద్,కరీంనగర్,మెదక్ జిల్లాల నాయకులను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు.కేసీఆర్ చేస్తున్నసర్వేలన్నీనెక్స్ట్ బీజేపీయే గెలుస్తుందని చెపుతున్నాయని,అయినా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నాయకు సూచించారు.
కేసీఆర్ తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుంటాడని సంజయ్ అన్నారు. యాసంగి వడ్ల కొనుగోలుకు సంబంధించి కేంద్రం అన్నిరాష్ట్రాల పౌరసరఫరాల శాఖలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైందన్నారు.అయితే.. తెలంగాణ మాత్రం రాష్ట్రం యాసంగి వడ్లు కొనేది లేదు అని ప్లాన్ ఇవ్వలేదని సంజయ్ చెప్పారు. కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉంటే రాష్ట్రం కొనక పోవడాన్ని రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని సంజయ్ తమ పార్టీ నాయకులకు సూచించారు.కేంద్రం రా రైస్ కొంటాము అంటే రాష్ట్రం కొనబోమంటోందని స్పష్టంచేశారు.పోయిన సారి కూడా కేసీఆర్ రైతుల్నిఅనవసరంగా ఆందోళనలో పడేశారని సంజయ్ గుర్తు చేశారు.
కోటి టన్నుల వడ్లు పండినాయి,కేంద్రం కొనట్లేదు ఢిల్లీ లో పోస్తాము,స్టేట్ బీజేపీ ఆఫీస్ ముందు పోస్తాము అన్నాడు,కానీ ఇప్పటి దాకా కేంద్రం చెప్పిన 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం టార్గెటే చేరుకోలేదని సంజయ్ ఎద్దేవ చేశారు.కేంద్రం బియ్యం కొనడానికి సిద్ధంగా ఉన్నారాష్ట్రం సిద్ధంగా లేదు అని ఆయన తేల్చిచెప్పారు.
ప్రత్యామ్నాయ పంటలు వేయ్యిమని చెప్పిబోనస్ ఇయ్యలేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నహామీ ఏమైంది అని సంజయ్ ప్రశ్నించారు.ఇన్నాళ్లు ఉద్యోగులు, నిరుద్యోగుల్నివేధించిన కేసీఆర్ ఇప్పుడు రైతుల పై కక్ష గట్టాడన్నారు.
KCR పవర్ పై కూడా కొత్త డ్రామా ..!
Advertisements
వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ పెడతారని ఈ మధ్య trs నేతలు కామారెడ్డి లో అన్నారు.వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టరని నేను కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ కాపీని చూపించి ఛాలెంజ్ చేసినా. సీఎం తోక ముడిచారని బండి హేళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల రూ. 62 వేల కోట్లనష్టాల్లో డిస్కం లు ఉన్నాయని వివరించారు సంజయ్.ఏప్రిల్ 1 నుంచి 68,000 కోట్ల రూపాయలు మేర చార్జీలు పెంచబోతున్నారని హెచ్చరించారు. అటు.. కేసీఆర్ ఫార్మ్ హౌజ్ లో 20 గ్రామాలకు సరిపోయే కరెంట్ వాడుతున్నారన్నారు. ఓల్డ్ సిటీ లో 70 శాతం కలెక్షను చేయట్లేదని,ఏటా కోటి రూపాయల్నిరైతులు వాడుతున్న కరెంట్ ఖాతాలో వేస్తున్నారని సంజయ్ అన్నారు.