– సీపీఎస్ ను రద్దుకు సహకరించమని వినతి
– ఉద్యోగులకు న్యాయం చేయాలి
– బదిలీలు, పదోన్నతుల కోసం ఒత్తిడి తేండి
– బండి సంజయ్ కు తపస్ వినతి
– ఉద్యోగుల పక్షాన పోరాడతామని బండి భరోసా
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి క్రుషి చేయాలని కోరుతూ.. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ను కోరారు. అందులో భాగంగా సీపీఎస్ ను రద్దు చేసేలా సహకరించాలని కోరారు. బదిలీలు, పదోన్నతులు చేపట్టేలా.. 317 జీవో బాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 30వ రోజు మహేశ్వరం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ను తపస్ రాష్ట్ర అధ్యక్షులు హన్మంత్ రావు, నవాత్ సురేష్ సహా పలువురు రాష్ట్ర నాయకులు కలిశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జూనియర్ లెక్చరర్లు, డైట్ లెక్చరర్లు, ఎంఈఓలు, డిప్యూటీ ఈవోలు, జీహెచ్ఎం, పీఎస్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 2018 తరువాత నుండి ఇప్పటి వరకు ఉద్యోగులకు బదిలీలు లేవని వాపోయారు.
317 జీవోతో అనేక మంది ఉపాధ్యాయులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పౌజ్ కేటగిరి కింద చేసుకున్న దరఖాస్తులకు మోక్షం లేదని బండి కి వివరించారు. పరస్పర బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఇచ్చిన జీవో అమలు కావడం లేదని పేర్కొన్నారు. అదేవిధంగా.. తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం హైదరాబాద్ జిల్లా ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు సైతం బండి సంజయ్ ను కలిసి సీపీఎస్ రద్దు కోసం పోరాడాలని కోరుతూ వినతి పత్రం అందించారు.
ఉద్యోగుల సమస్యలను సావధానంగా విన్న సంజయ్.. సీపీఎస్ రద్దు పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. ఉద్యోగుల పక్షాన పోరాడతామని వెల్లడించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులతో పాటు.. 317 జీవో రద్దు కోసం ఇప్పటికే అనేక పోరాటాలు చేశామని అన్నారు. భవిష్యత్తులోనూ ప్రభు