తెలంగాణ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కోల్పోవటానికి మీ తప్పిదాలే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు కావాల్సిన మౌళిక సదుపాయాలు కల్పించకుండా ప్రాజెక్ట్ రాకుండా చేశారని… మీ నిర్లక్ష్యం వల్లే వెనక్కిపోయిందని ఆరోపించారు.
రేడియల్ రోడ్లు, ఎంఎంటీఎస్, రైల్వే లైన్ల అభివృద్ధికి నిధులు కేటాయించటంలో మీరు చూపిన నిర్లక్ష్యమే కారణమని… ఇప్పుడు ఆ తప్పును ఇతరులపైకి నెట్టేందుకు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు బండి సంజయ్ కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.