– బండి యాత్రకు అనూహ్య స్పందన
– ఆదరిస్తున్న ప్రతి పల్లె,ఇల్లు
– జనం కష్టసుఖాలు విచారిస్తున్న బండి
– నియంతృత్వానికి చరమగీతమే లక్ష్యం
బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. అడుగడుగునా ప్రతి పల్లెలో జనం వేలల్లో హాజరై బండి యాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. తెలంగాణలో నెలకొన్న నియంతృత్వ పాలన అంతమొందించే ఎవరితోనైనా తాము భుజం భుజం కలిపి నడుస్తామంటూ ఆదరిస్తున్నారని బండి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటంబ పాలన అంతమొద్దిద్దాం అనే పిలుపునకు చప్పట్లతో ఆమోదాన్ని తెలియచేస్తున్నారని బండి అంటున్నారు.
తాజాగా సంగారెడ్డి జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఇది కనీవినీ ఎరగని ప్రజా స్పందన అని బండి అభిప్రాయపడ్డారు. వందలాది మంది కార్యకర్తలు, వేలాది మంది ప్రజలతో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.
Advertisements
పెద్దాపూర్ గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకున్నట్లు వివరించారు. సదాశివపేట నుండి సంగారెడ్డి వైపుగా ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతోంది. బండి సంజయ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, పాదయాత్ర ఇన్ ఛార్జ్ లు తూళ్ల వీరేందర్ గౌడ్, లంకల దీపక్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి, సంగప్ప, సింగాయపల్లి గోపి, పార్టీ సంగారెడ్డి ఇంఛార్జ్ దేశ్ పాండే సహా తదితరులు పాదయాత్ర చేస్తున్నారు.