ప్రజా సంగ్రామ యాత్ర ఆరోరోజు జనం పోటెత్తారు. చేవెళ్ల మోడల్ కాలనీ నుంచి యాత్రను ప్రారంభించిన బండి సంజయ్ అడుగులో అడుగేసుకుంటూ ముందుకు కదులుతున్నారు ప్రజలు. అన్ని వర్గాల నుంచి పాదయాత్రకు విశేష స్పందన వస్తోందని చెబుతున్నారు బీజేపీ నేతలు.
దామరగిద్ద గ్రామంలో టమాటా రైతులను కలిశారు బండి సంజయ్. పొలంలోకి వెళ్లి వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
టీఆర్ఎస్ నిరంకుశ పాలనలో రైతులకు బీమా లేదు.. వృద్ధులకు పెన్షన్ అందడం లేదని విమర్శించారు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా..పట్టించుకోవడం లేదని ఓ మహిళ తన ఆవేదనను వెల్లడించింది. కేసీఆర్ దుర్మార్గపు పాలనతో బతుకు భారమైపోయిందని.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను పాతిపెడతామని రైతులు బండికి తెలిపారు.
ప్రజా సంగ్రామ యాత్రలో వేలాది మంది పాల్గొంటున్నారు. మీర్జాగూడ, ఖానాపూర్ గేట్ మీదుగా చట్టంపల్లి గేట్ వరకు ఇవాళ పాదయాత్ర కొనసాగుతుంది.