కేసీఆర్ సర్కార్ ను గద్దె దించుతామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 16వ రోజుకు చేరుకుంది. మెదక్ జిల్లా చిట్కుల్ గ్రామంలోని చాముండేశ్వరి ఆలయం నుండి యాత్ర ప్రారంభించారు. యాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు కదులుతున్నారు బండి. కేసీఆర్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. ఎవరిని పలకరించినా ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారని అన్నారు.
చిట్కుల్ లో శంకరయ్య, రాఘవులు అనే రైతులు బండి సంజయ్ ను కలిసి డబుల్ బెడ్రూం ఇళ్లు రాలేదని.. తమ గోడును వివరించారు. ఇవాళ పాదయాత్రలో బీజేపీ సీనియర్ నేత విజయశాంతి పాల్గొననున్నారు. బండి సంజయ్ రంగంపేట ప్రాంతానికి చేరుకోగానే ఆయనతోపాటు యాత్ర చేయనున్నారు విజయశాంతి.
13న బండి పాదయాత్రకు చత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రానున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని పోతంశెట్టి పల్లెలో పాదయాత్ర చేయనున్నారు.