బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు.
నాగ పంచమి సందర్భంగా ఏడుగుళ్ళ దేవాలయంలో అభిషేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి యాదగిరిగుట్టకు బయలుదేరారు. కాసేపట్లో మూడో విడత పాదయాత్ర ప్రారంభించనున్నారు సంజయ్. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. అలాగే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొంటారు.
తొలిరోజు 10 కిలోమీటర్లు నడవనున్నారు బండి సంజయ్. రాత్రికి బస్వాపూర్ లో బస చేస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు రోజులు టూర్ ఉండేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు. ఈ యాత్ర మొత్తం 24 రోజుల పాటు సాగనుంది. 328 కిలోమీటర్లు నడవనున్నారు.
యాదాద్రి భువనగిరి, నల్లగొండ, జనగాం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 మండలాల్లో పాదయాత్ర చేయనున్నారు.