• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Hyderabad » కేసీఆర్‌ సారూ.. ప్లీనరీలో మా ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా..?

కేసీఆర్‌ సారూ.. ప్లీనరీలో మా ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా..?

Last Updated: April 27, 2022 at 1:19 pm

బండి సంజయ్.. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు
టీఆర్‌ఎస్‌ పార్టీ 21వ ప్లీనరీ సమావేశం ఏప్రిల్‌ 27న నిర్వహించుకోబోతున్నారు. రాష్ట్రముఖ్యమంత్రిగా, అధికారపార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న మీరు ఈ ఎనిమిదేండ్ల పాలనలో ఒరగబెట్టింది ఏమిటో మూడున్నరకోట్ల తెలంగాణ ప్రజానికానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎనిమిదేండ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన వైఫల్యాలు, అవినీతి, నియంతృత్వ పోకడలు, ప్రజాస్వామ్య హననం, కుటుంబపాలన వంటి అంశాలలోకి పోతే మీ అసమర్థ పాలనపై వెయ్యి ప్రశ్నలు అడిగినా సరిపోవు.

కేసీఆర్‌ సారు.. మీకు నిజం చెప్పకూడదు అన్న శాపం ఏమైనా ఉందా..? ఏనాడైనా మీ జీవితంలో నిజాలు చెప్పారు..? అబద్ధాలతో ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా..? కనీసం మీ పార్టీ ఘనంగా జరుపుకుంటున్న 21వ ప్లీనరీ సందర్భంగా అయినా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరుపున మేము అడిగే 21 ప్రశ్నలకైనా సమాధానం చెప్పండి. మీరు సమాధానాలు దాటవేస్తే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వంగా ఒప్పుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పండి.

1. 2014లో 32 పేజీలు, 2018లో 16 పేజీల ఎన్నికల మానిఫెస్టోను విడుదల చేసి తెలంగాణ ప్రజలకు మీరు అనేక హామీలు ఇచ్చారు. ఇందులో ఎన్ని అమలు చేశారు..? ఎన్ని అమలు చేయలేదు..? దీనిపై చర్చించడానికి మీరు సిద్ధమేనా..? కనీసం దీనిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా..?

2. ఇంటికో ఉద్యోగం ఇస్తామని వాగ్దానం చేసిన మీరు.. మీ కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఇది వాస్తవం కాదా..? దీనికి మీ సమాధానమేమిటి..? కేసీఆర్.

3. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3,016లు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఎంత మందికి విద్యావంతులైన యువతకు భృతి అందించారు..? ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఎప్పటి నుండి ఇస్తారు..?

4. బిస్వాల్‌ కమిటి నివేదిక ప్రకారం రాష్ట్రప్రభుత్వ శాఖల్లో 1.91 లక్షల ఖాళీలుండగా.. కేవలం 81 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామనడం నిరుద్యోగ యువతను మోసం చేయడం కాదా..? మిగతా పోస్టుల భర్తీ ఎప్పుడు ప్రారంభిస్తారు?

5. పోడుభూములకు పట్టాలు ఇవ్వడం.. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లపై అర్డినెన్స్‌ తేవడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడం నిజం కాదా?

6. దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం.. దళిత బంధును విస్తరించి రాష్ట్రమంతా అమలు చేయడంలో మీ ప్రభుత్వ వైఫల్యం మీకు కనిపించట్లేదా?

7. దళితున్ని ముఖ్యమంత్రిగా ఎప్పుడు చేస్తారు..? ముఖ్యమంత్రి ముచ్చట దేవుడెరుగు కనీసం దళితున్ని మీ పార్టీ అధ్యక్షునిగా అయినా చేస్తారా..? ఎస్సీ, ఎస్టీ, సబ్‌ప్లాన్‌ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించి.. ఎస్సీ, ఎస్టీలను మీ ప్రభుత్వం మోసగించిన మాట వాస్తవం కాదా? 125 ఫీట్ల డా.బాబా సాహెబ్‌ అంబెడ్కర్ విగ్రహాన్ని ఎప్పుడు ఆవిష్కరిస్తారు?

8. బీసీబంధు పథకాన్ని ఎప్పటినుంచి ప్రవేశపెడతారు? బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు, ఖర్చులపై మీ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందా? బీసీలకు ఇవ్వాల్సిన 3 వేల కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్‌ నిధులను ఎప్పుడు మంజూరు చేస్తారు? ఆత్మగౌరవ భవనాలను ఎప్పుడు నిర్మిస్తారు?

9. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని 2014 ఎన్నికల మానిఫెస్టోలో పేజీ నెం.7లో మీరు హామీ ఇవ్వడం జరిగింది. ఈ 8 సంవత్సరాల కాలంలో ఏ ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించారో మీరు వివరాలు అందించగలరా?

10. మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మీ అసమర్థ పాలన కారణంగానే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి మీ సమాధానమేంటి?

11. రైతులకు లక్షరూపాయలు రుణమాఫీ చేస్తామని 2014, 2018 ఎన్నికల్లో మీరిచ్చిన హామీ ఎంతమేరకు నెరవేర్చారు? మాకున్న సమాచారం ప్రకారం ఇంకా 31 లక్షల మంది రైతులకు రుణ మాఫీ చేయాల్సి ఉంది. ఈ హామీని ఎప్పటిలోగా మీరు నెరవేరుస్తారు?

12. వరి వేస్తే ఉరి అని, రైతాంగాన్ని భయబ్రాంతులకు గురిచేసి రైతులు వరి పండిరచకుండా అడ్డుకుంది మీరు కాదా..? తెలంగాణ రైతాంగాన్ని నిలువునా ముంచి కేంద్రంపై మొసలి కన్నీరు కార్చడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా?

13. ‘‘కేసీఆర్‌ జమానా అవినీతి ఖజానా’’ అని సకలజనులు తెలంగాణలో ఘోషిస్తున్నారు. ప్రగతిభవన్‌ అవినీతి భవన్‌ గా, తెలంగాణ ద్రోహులకు నిలయంగా మారిందన్న దానిపై మీ జవాబు ఏంటి? 2014లో మీరు ముఖ్యమంత్రి పదవిచేపట్టే నాటికి మీ ఆస్తులు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధువుల ఆస్తులు ఎంత..? ఇప్పుడు ఎంత..? మీ ఆస్తులు లక్ష రెట్లు పెరిగిన మాట నిజం కాదా? దీనిపై చర్చకు మీరు సిద్ధమా?

14. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రీడిజైనింగ్‌ పేరిట అంచనాలు పెంచి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మీరు కొల్లగొట్టారా లేదా? పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు, ఇతరసాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలోనూ.. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, విద్యుత్‌ ప్రాజెక్టుల, విద్యుత్‌ కొనుగోళ్లు, ప్రభుత్వ భూముల అమ్మకాల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగింది. వీటికి సంబంధిచిన ఫైల్స్‌, సంబంధిత పత్రాలు అఖిలపక్షం ముందు పెట్టి దీనిపై చర్చించడానికి మీరు ముందుకువస్తారా?

15. 2014 ఎన్నికల సందర్భంగా మీరు విడుదల చేసిన మానిఫెస్టోలో పేజీ నెం.14లో బలహీన వర్గాలకు గృహ నిర్మాణం అనే అంశం కింద ‘‘ఇల్లు లేని నిరుపేదలకు 125 గజాల స్థలంలో 3 లక్షల రూపాయల వ్యయంతో రెండు పడక గదులు, ఒక హాలు, ఒక వంటగది, స్నానాల గది, మరుగుదొడ్డి ఉన్న ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎన్ని ఇల్లులు నిర్మించారు? ఎంత మంది పేదలకు ఇచ్చారు? వీటికి లెక్కలు చెప్పగలరా? ఆ ఇళ్లను మాకు చూపించగలరా?

16. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2.91 లక్షల ఇండ్లను తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేసింది. అందులో ఎన్ని ఇండ్లను పూర్తి చేశారు? వాటి వివరాలను ఇవ్వగలరా? గజ్వేల్‌, సిరిసిల్ల, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించారు..? మిగితా 116 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించారు..? వీటి వివరాలు తెలంగాణ ప్రజలకు తెలుపుగలరా?

17. 2014 నుండి 2022 వరకు కేంద్రంలోని నరేంద్రమోడీ నాయకత్వంలోని ప్రభుత్వం.. రాష్ట్రానికి వివిధ సంక్షేమ పథకాల రూపంలో ఎన్ని నిధులు మంజూరు చేసింది. ఎన్ని నిధులు వచ్చాయి.. తదితర అంశాలపై మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ చర్చకు మీరు సిద్ధమా?

18. నిజాం షుగర్‌ పునరుద్ధరణ, నిజామాబాద్‌ జిల్లాలో చెరుకు పరిశోధనా కేంద్రం, పాలమూరు జిల్లాలో చేపల పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఎన్నికల హామీ ఏమైంది? ఈ హామీ ఎప్పుడు నెరవేరుస్తారు?

19. మిషన్‌ కాకతీయను ‘‘కమీషన్‌ కాకతీయ’’ గా మార్చి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీ పార్టీ వారు దోచుకోలేదా? దీనిపైనా జ్యూడిషల్‌ ఎంక్వయిరీకి మీరు సిద్ధమా? మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో కమీషన్ల కోసం ప్రాధాన్యం లేని చెరువులకు పనులు చేపట్టారని ‘కాగ్‌’ తప్పుపట్టిన మాట వాస్తవం కాదా?

20. కృషా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి 575 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా.. 299 టీఎంసీలు నీటి వాటాకు ఒప్పుకొని తెలంగాణ రాష్ట్రానికి మీరు తీరని ద్రోహం చేసిన మాట వాస్తవం కాదా?

21. దేశ వ్యాప్తంగా చూస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తెలంగాణలో ఎక్కువగా ఉన్న మాట వాస్తవం కాదా? పెట్రోల్‌, డీజిల్‌ ధరలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంత ఉన్నాయి..? తెలంగాణలో ఎంత ఉన్నాయి? దీనిపైన చర్చించడానికి మీరు సిద్దమా?

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

భార‌తీయుల‌కు గుడ్ న్యూస్..!

హైకోర్టు సీజే సతీష్‌ చంద్ర బదిలీ.. జస్టిస్‌ ఉజ్జల్‌ కు పదోన్నతి

రాష్ట్ర ప్ర‌భుత్వం నుండి పూర్తి స‌హ‌కారం ఉంటోంది: కేటీఆర్

ఫోన్ నెంబర్‌తో‌నే పక్కా స్కెచ్.. నాగరాజు హత్య కేసులో ముగిసిన కస్టడీ..!

ఆర్ధిక ఇబ్బందుల్లో కమల్ మాజీ భార్య… పట్టించుకోని శృతిహాసన్?

బ్యాట్ తో బాజా.. సినిమాల్లో మ‌జా..!

ఇదేం రాక్షసత్వం కేసీఆర్!

చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?

ఎన్టీఆర్ కు ఫస్ట్ ప్లేస్.. చరణ్ కు నాలుగో స్థానం

సర్కారువారి పాట చూసి సితార రియాక్షన్ ఏంటి?

బాలయ్య చేతులమీదుగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

సమంత, విజయ్ దేవరకొండపై పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్

ఫిల్మ్ నగర్

ఆర్ధిక ఇబ్బందుల్లో కమల్ మాజీ భార్య... పట్టించుకోని శృతిహాసన్?

ఆర్ధిక ఇబ్బందుల్లో కమల్ మాజీ భార్య… పట్టించుకోని శృతిహాసన్?

బ్యాట్ తో బాజా.. సినిమాల్లో మ‌జా..!

బ్యాట్ తో బాజా.. సినిమాల్లో మ‌జా..!

చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?

చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?

ఎన్టీఆర్ కు ఫస్ట్ ప్లేస్.. చరణ్ కు నాలుగో స్థానం

ఎన్టీఆర్ కు ఫస్ట్ ప్లేస్.. చరణ్ కు నాలుగో స్థానం

సర్కారువారి పాట చూసి సితార రియాక్షన్ ఏంటి?

సర్కారువారి పాట చూసి సితార రియాక్షన్ ఏంటి?

బాలయ్య చేతులమీదుగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

బాలయ్య చేతులమీదుగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

సమంత, విజయ్ దేవరకొండపై పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్

సమంత, విజయ్ దేవరకొండపై పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్

ఆర్ఆర్ఆర్ కు రూ.100.. కేజీఎఫ్ 2కు రూ.199

ఆర్ఆర్ఆర్ కు రూ.100.. కేజీఎఫ్ 2కు రూ.199

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)