ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. నిర్మల్ లో జరుగుతున్న సభకు హాజరయ్యేందుకు వెళ్లారు. ముందుగా నిర్మల్ లో రాంజీ గోండు, కొమురం భీమ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత ఉరులమర్రిని సందర్శించుకొని సభా స్థలికి వెళ్లారు.
అంతకుముందు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు బండి. నిజాం, రజాకర్ల మెడలు వంచిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు వందనం సమర్పిస్తూ.. ఆనాటి సమరయోధులను గుర్తుచేశారు.