వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, అధికారం కైవసం చేసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఆయన బీజేపీతోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు.
ప్రధాని మోడీ చేపడుతున్న పథకాలు తెలంగాణలో అమలు కావడం లేదని, మోడీకి పేరు రావడం సీఎం కేసీఆర్‌కు ఇష్టం లేదని విమర్శించారు. కుల సంఘాల భవనాలకు ముఖ్యమంత్రి గుంట స్థలం కూడా కేటాయించలేదని ఆరోపించారు. మైనార్టీల కోసమే సీఎం పని చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను గద్దె దించుతామని, ముఖ్యమంత్రి నోరు తెరిస్తే వంద కోట్లు, వెయ్యి కోట్లు అంటారని కానీ అవి వచ్చేది లేదు.. ఇచ్చేది లేదని బండి సంజయ్ మండిపడ్డారు.