అవకాశం దొరికినప్పుడల్లా… కేసీఆర్ సర్కార్, టీఆర్ఎస్ పై ఫైర్ అవుతోన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ అప్పుల్లో ఉందని మూసేస్తే… రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్‌ను ఏం చేయాలని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తూ, ప్రైవేటు సంస్థలతో కేసీఆర్ చేసుకున్న ఒప్పందాలపై గవర్నర్ విచారణ జరపాలని కోరారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగే వరకూ… బీజేపీ అండగా ఉంటుందని, కార్మిక నేత అశ్వాద్ధామరెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయబోతున్నారని మండిపడ్డారు.
హుజూర్‌నగర్‌లో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారని విమర్శించారు.
ఇటీవల కేసీఆర్‌పై కరీంనగర్ ఎంపీ వ్యాఖ్యలు, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న కామెంట్స్ బీజేపీలోనూ హట్ టాపిక్ అవుతున్నాయి. ఎంపీగా గెలిచన నాటి నుండి ఎంపీ ఫైట్‌ను ముచ్చటపడుతున్నారు బీజేపీ కార్యకర్తలు.