బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతంగా సాగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి.. బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ప్రజాసంగ్రామ యాత్రను నిర్వహిస్తున్న సంజయ్.. రెండవ రోజు 13 కిలోమీటర్ల మేర తన యాత్రను కొనసాగించనున్నారు.
ఈ పాదయాత్రలో భాగంగా పొలాల్లో పనిచేస్తున్న కూలీలతో సంజయ్ ముచ్చటించారు. వారి మంచి చెడులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు సకాలంలో అందుతున్నాయా..? లేదా అని అడిగి తెలుసుకున్నారు సంజయ్.
అందరికీ.. రేషన్ బియ్యం సకాలంలో అందుతున్నాయా..? కేసీఆర్ ఇస్తానన్న దళిత బంధు ఎంతమందికి వచ్చింది.. దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి వచ్చిందా అనే విషయాలను అడిగి తెలుసుకున్న సంజయ్.. వాటి పేరుతో జరిగే మోసాలను ప్రజలకు వివరించారు.
ఆయుష్మాన్ భారత్ పథకం రాష్ట్రంలో అమలు చేయడంలేదని మండిపడ్డారు. ఆ పథకం అమలు చేస్తే.. దేశంలో ఎక్కడైనా ఉచిత సేవలు పొందవచ్చునేని ప్రజలకు వివరించారు సంజయ్. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. అనేక సౌకర్యాలు అందిస్తామని హామీలిస్తూ కూలీలతో ముచ్చటించాడు సంజయ్.