దేవుడి పేరుతో రాజకీయాలు చేసేది బండి సంజయ్, బీజేపీ అని మండిపడ్డారు కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. జై శ్రీరాం అనే నినాదం అందరి సొత్తు, బీజేపీ పార్టీ ఒక్కరి నినాదం కాదని ఆయన అన్నారు.
ఆలయాల అభివృద్ది కోసం సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని ఆయన అన్నారు. దేవుళ్లను మోసం చేస్తుంది బీఆర్ఎస్ కాదు బీజేపీ అని మండిపడ్డారు. హిందువులం అని బండి సంజయ్ పబ్బం గడుపుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని రవిశంకర్ అన్నారు.
మతం పేరుతో యువతను ఉన్మాదులుగా మారుస్తుంది బీజేపీ అని అన్నారు. బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ది భూదందా అని మాట్లాడుతున్నారని, కొండగట్టు మీద ఎక్కడ భూములు ఉన్నాయో చూపాలని ఆయన డిమాండ్ చేశారు.ఎన్నికల కోసం కాదు దేవాలయాల అభివృద్ధి కోసం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.