ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేరు పడిన తర్వాత… నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు 2024 ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సీఎం కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఇటువంటి సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడు అభిమాని బండ్ల గణేష్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పొలాల రేట్లు ఊహించని స్థాయిలో ఉన్నాయని అలాగే ఇక్కడ అమలవుతున్న పథకాలు కూడా చాలా బాగున్నాయని చెప్పుకొచ్చారు.
ALSO READ : తొలి మూడు సినిమాలు హిట్ అవ్వగానే ఉదయ్ కిరణ్ ని ఎవరు భయపెట్టారు ? అప్పుడు ఉదయ్ కిరణ్ ఎలా చేసాడంటే?
కేసీఆర్ క్రమశిక్షణ వల్లే తెలంగాణ పరిస్థితి బాగుందని అన్నారు. ప్రస్తుతానికి సినిమాలు తీయడంపైన మాత్రమే తనకు ఇంట్రెస్ట్ ఉందని అలాగే పవన్ కళ్యాణ్ ను ఏపీ సీఎంగా చూడాలని తన కోరికని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఆయన డేట్లు ఇస్తే సినిమా తీస్తానని కూడా తెలిపారు.
పవన్ కళ్యాణ్ నాకు లైఫ్ లో చాలా చేశారని… నా స్థాయికి మించి సహాయం చేశాడని చెప్పుకొచ్చారు. నాతో సినిమా చేయకపోయినా సరే ఏపీకి ఉపయోగపడాలని అన్నారు. అలాగే పవన్ గురించి మాట్లాడేటప్పుడు తాను ప్రిపేర్ కానని మనసులో ఏముంటే అదే మాట్లాడతానని కచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని చెప్పుకొచ్చారు.