నీ గురించి ఆలోచించుకో..బ్రతికినంత కాలం బాగుపడతావ్ - Tolivelugu

నీ గురించి ఆలోచించుకో..బ్రతికినంత కాలం బాగుపడతావ్

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బండ్ల గణేష్ ట్వీట్ లు దుమారాన్ని రేపుతున్నాయి. గబ్బర్ సింగ్ 8ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ కు బండ్ల గణేష్ కు మొదలైన వివాదం ఇంకా కొనసాగుతునే ఉంది. ఇటీవల ప్రముఖ నిర్మాత పీవీపీ కూడా దర్శకుడు హరీష్ శంకర్ కు మద్దతుగా నిలిచారు. బండ్ల గణేష్ యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్ కూడా తియ్యటానికి పనికిరాడని ట్వీట్ చేశాడు.

తాజాగా బండ్ల గణేష్ మరో ట్వీట్ చేశారు. “ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు..ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో బ్రతికినంత కాలం బాగుపడతావ్ అంటూ ఓ ఇమేజ్ ను పోస్ట్ చేశారు. ఇది ఇంతకు ఎవరిని ఉద్దేశించి పెట్టారో తెలీదు కానీ గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp