సినీ ఇండస్ట్రీలో టిక్కెట్ ధరల రగడ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం పై సినీస్టార్స్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే అందుకు సమాధానంగా వైసీపీ నేతలు కూడా ఇండస్ట్రీ వారిపైఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా తాజాగా ఓ టీవీ ఛానల్ డిబేట్ లో వైసిపి అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ పుష్ప సినిమాలో కొండారెడ్డి, జక్కా రెడ్డి, జాలి రెడ్డి అంటూ కావాలనే పేర్లు పెట్టారని ఎందుకంటే నిర్మాత చంద్రబాబునాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని, అలాగే హీరో కాపు సామాజిక వర్గానికి చెందిన వాడని అందుకే విలన్ లకు రెడ్డిల పేరు పెట్టారని అన్నారు.
అయితే ఇదే విషయంపై బండ్లగణేష్ స్పందించారు
సైరా నరసింహా రెడ్డి, ఇంద్ర సేనారెడ్డి, సమర సింహ రెడ్డి అని హీరో పాత్రల పేర్లు పెట్టి సినిమాలు తీసారనే విషయాన్ని గుర్తు చేశారు. సమరసింహా రెడ్డి సినిమా తీసిన బాలకృష్ణ, దర్శకుడు బి.గోపాల్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారని కానీ రెడ్డి వర్గానికి చెందిన పేరు పెట్టి హీరోయిజం చూపించారని అన్నారు.
ఇంద్ర సినిమాలో ఇంద్రసేనారెడ్డి పాత్ర పోషించిన చిరంజీవి కాపు సామాజిక వర్గం, నిర్మాత అశ్వినీదత్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఇవన్నీ గుర్తు పెట్టుకుని మాట్లాడాలని బండ్ల గణేష్ అన్నారు. ఇండస్ట్రీ కి కులంను పేరును ఆ ఆపాదించవద్దని కోరారు.