గబ్బర్ సింగ్ సినిమా తో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిపోయిన నటుడు బండ్ల గణేష్. గబ్బర్ సింగ్ సినిమా 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గబ్బర్ సింగ్ సినిమా కు నిర్మాతగా వ్యవహరించిన బండ్ల గణేష్ సినిమాల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ట్వీట్ చేశాడు. నాకు కిక్ ఇచ్చేది రాజకీయాలు కాదు.. సినిమాలే అని తెలుసుకున్నాను. అందుకే ఇకపై సినిమాలతోనే కిక్ పొందాలని డిసైడ్ అయ్యానని చెప్పుకొచ్చారు.
జీవితంలో కిక్ కావాలంటే ఒక్క సినిమానే అని నేను డిసైడ్ అయ్యా. నాకు సినిమానే జీవితం సినిమాయే ప్రాణ౦. నా 15 సంవత్సరాల వయస్సులో సినిమా ఇండస్ట్రీకి వచ్చా. నాకు రాజకీయాలు వద్దు సినిమాయే ముద్దు. నావల్ల నా మాటలు వల్ల బాధపడ్డ ప్రతి ఒక్కరినీ క్షమించమని కోరుకుంటున్నాను..’’ అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.