చేేతులెత్తి దండం పెడుతున్నా, పల్నాటి పరువు తియ్యొద్దు.. అంటున్నారు సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్,
పల్నాటి గొడవలతో పరువు గంగలో కలిసింది. ఇప్పటికే పలుసార్లు చచ్చాము. మద్రాస్ అని, కర్నూల్ అని, హైదరాబాద్ అని వేధింపులకు గురయ్యాము. పోలవరాన్ని, అమరావతిని అటకెక్కించారు. ఆంధ్ర ఇంకో బీహార్ అయ్యిందంటున్నారు. ఇప్పట్లో ఇంకో ఎన్నికలు లేవని YCP-TDP తెలుసుకోవాలి. కలిసి పనిచేస్తే రాష్ట్రానికి మంచిది. కక్ష సాధింపులతో పరువు బజారుపాలు. 100 రోజుల్లో ఏమి చెయ్యని జగన్ నిద్రలేవాలి. తిరస్కారానికి గురయిన బాబు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి. ఏ జండాలేని, ఎజెండా లేని నాయకులు కొంతకాలం రెస్ట్ తీసుకుంటే మంచిది. జనాన్ని కాసేపు మనశాంతిగా ఉండనివ్వండి. మీ కన్ఫ్యూషన్‌లో జనం ఏమి చెయ్యాలో, ఎక్కడ ఉండాలో, అమరావతి ఉంటుందో ఊడుతుందో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. దగా పడ్డ తెలుగు ప్రజలారా మీరు ఏ నాయకుణ్ణి నమ్మొద్దు. మీకు సహాయం చేసే స్థితిలో నేను లేను. మనందరినీ ఆ భగవంతుడే కాపాడాలి. భావితరాలకు ఆయనే దిక్కు.