పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ కు ఉన్న అభిమానం గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ మాట వినిపిస్తే చాలు బండ్ల గణేష్ లో పూనకం వస్తుంది. ఇక ఇటీవల పవన్ పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిజాయితీకి నిలువుటద్దం పవన్ కళ్యాణ్. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఎంతో మంది సాంకేతిక నిపుణులు ఎంతోమంది నిర్మాతల్ని పరిచయం చేసిన ఘనత మా దైవం పవన్ కళ్యాణ్ ది.
పవన్ కళ్యాణ్ మహోన్నతమైన వ్యక్తి.రాజకీయాలుఎవరైనా చేసుకోవచ్చు. రాజకీయాలు ఎవరైనా మాట్లాడుకోవచ్చు…కానీ వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా నేను సహించను. పవన్ కళ్యాణ్ నా దృష్టిలో నాకు ఎప్పటికీ దైవంతో సమానం. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. రాజకీయాలతో సంబంధం లేదు. కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. ఆయన వ్యక్తిత్వం ఆయన నిజాయితీ ఆయన నిబద్ధత నాకు తెలుసు. ఎలక్షన్ టైం లో మాట్లాడటం ధర్మం కాదని రాజు మాట్లాడకూడదని నేనేం మాట్లాడలేదు. ఒకటి మాత్రం చెప్తున్నా… నేను ఈ రోజు అనుభవిస్తున్న ఈ స్థాయి నాకు పవన్ కళ్యాణ్ పెట్టిన బిక్ష. నా కృతజ్ఞత అనేది నా రక్తంలో ఉంది అంటూ చెప్పుకొచ్చారు.