చెక్ బౌన్స్ కేసు లో బండ్ల గణేష్ కి ఊరట లభించింది. సంబంధిత వ్యక్తులతో బండ్ల గణేష్ న్యాయవాది చేసిన రాజీ యత్నాలు ఫలించాయి. బాకీ పడ్డ మొత్తంలో… 4 లక్షలు వెంటనే చెల్లించి, మిగతా మొత్తాన్ని నవంబర్ 14 వ తేదీ లోపు చెల్లించాలని ఒప్పందం కుదరడంతో బెయిల్ పిటిషన్ ను బండ్ల న్యాయవాదులు దాఖలు చేశారు. పిటిషన్ ను పరిశీలించిన మేజిస్ట్రేట్ గణేష్ కు బెయిల్ మంజూరు చేశారు.