ప్రముఖ నిర్మాత, యాక్టర్ బండ్ల గణేష్ కు ఊరట లభించింది. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా అనుచరులతో దాడికి పాల్పడ్డాడంటూ వైసీపీ నేత పీవీపీ ఇచ్చిన పిర్యాదు పై బండ్ల గణేష్ కు నాంపల్లి కోర్ట్ ముందస్తు బెయిల్ ఇచ్చింది.
టెంపర్ సినిమా టైంలో 30 కోట్ల రూపాయల ఫైనాన్స్ తీసుకున్న గణేష్ ఇంకా 7 కోట్లరూపాయలు చెల్లించాల్సి ఉందని పీవీపీ ఆరోపించారు. తనకు రావాల్సిన సొమ్ము ఇవ్వమని అడిగితే అనుచరులతో కలిసి అర్ధరాత్రి దాడి చేశారని పీవీపీ అన్నారు. ఇదే కేసులో బంజారాహిల్స్ పోలీస్ లు విచారణకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.