చావు అందరిని మారుస్తుంది, అది మన పగోడిదైనా.. కనీసం కట్టే కాలే వరకూ అయినా చనిపోయినోళ్ల గురించి చెడుగా మాట్లాడకుండా ఉండటం మన సంప్రదాయం. రూపాయి డాక్టర్‌గా ఎంతో మందికి సేవ చేసి, ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా ప్రజలకు అండగా ఉన్న నాయకుడి పోస్ట్‌మార్టమ్ కూడా కాకుండానే శవ రాజకీయాలు మొదలు పెట్టేశారు. 72 ఏళ్ల వ్యక్తి, ఈ వయసులో ఎందుకు ఉరిపోసుకొని ప్రాణాలు తీసుకున్నాడు అన్న ఆలోచన లేకుండా శల్యపరీక్ష చేసి ఇంకా చంపేస్తున్నాం. ఇలాంటి రాజకీయాలు నేను ఎప్పుడు చూడలేదు.
ఎన్టీఆర్ నుంచి వైఎస్సార్ వరకు ఎందరో నాయకులు తెలుగునేలపై తిరిగారు. అలానే వారి టైం అయ్యాక కాలగర్భంలో కలిసిపోయారు. ఎప్పుడూ కూడా ఇలాంటి నీచపు వ్యాఖ్యలు వినలేదే! ఆనాడు అన్నగారికి కుటుంబ కలహాలు లేవా? మొన్న మహానేత మీద అవినీతి ఆరోపణలు మర్చిపోయారా?
చేతులెత్తి వేడుకుంటున్నాను, చనిపోయిన వ్యక్తి గురించి నాలుగు మంచి మాటలు చెప్పే సంస్కారం లేకపోతే మూసుకొని కూర్చోండి. అంతేకానీ, నీచంగా శవ రాజకీయాలు చేయకండి. నాకు కోడెల గారితో అనుబంధం ఉందని నేను మాట్లాడటం లేదు. ఒక మనిషిగా మాట్లాడుతున్నా. మనమెవ్వరం ఈ భూమి మీద శాశ్వతం కాదు అని తెలుసుకుని అంటున్నా. ఇక ఆపండి. రేపు మీ చావుని కూడా ఇలా బజారు రాజకీయంలోకి ఈడ్చి పడేయకుండా ఉండాలంటే ఇక్కడితో ఆపండి..
-బండ్ల గణేశ్, సినిమా నటుడు, నిర్మాత