బండ్ల గణేష్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. కమెడియన్ గా నిర్మాతగా ఎంతో పేరు తెచ్చుకున్న బండ్లగణేష్ ఇప్పుడు హీరోగా రాబోతున్నాడు. ఈ సినిమాకు డేగల బాబ్జీ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అందులో కళ్లు మాత్రమే కనిపించేలా ముఖాన్ని కవర్ చేస్తూ కంటిపై ఘాటుతో కనిపించాడు బండ్ల. ఆ ఘాటు కి కుట్లు, దాని నుంచి రక్తం కారుతూ ఉంది.
ఇక ఇక ఈ సినిమాకు వెంకట్ చంద్ర దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. తమిళంలో హిట్ అయిన ఓత్త సెరుప్పు సైజ్ 7 కి రీమేక్ ఇది. తమిళంలో పార్తిబన్ చేసిన పాత్రను బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ పాత్ర కోసం పత్యేకంగా మేకోవర్ అయ్యాడు గణేశ్.