మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఉత్కంఠ పెంచేస్తున్నాయి. తాము విడిగానే బరిలో ఉంటామని ప్రకటించిన జీవితా రాజశేఖర్, హేమలు ప్రకాశ్ రాజ్ దౌత్యంతో వెనక్కి తగ్గి తన ప్యానల్ లో చేరిపోగా… ప్రకాశ్ రాజ్ ప్యానలోనే ఉన్న బండ్ల గణేష్ షాకిచ్చాడు.
తాను ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుండి తప్పుకుంటునట్లుగా బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో బండ్ల గణేష్ అధికార ప్రతినిధి హోదాలో పోటీలో ఉన్నారు. అయితే, ఆయన సొంతగా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా… అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం చేయలేదు.