వేణన్న దూరమవటం ఎంతో దుర్ధినమని, అందరితో ఎంతో సరదాగా, ఆప్యాయంగా ఉండే వేణు మాధవ్ చిన్న వయస్సులోనే ఇలా జరగటం బాధిస్తోందన్నారు సిని నిర్మాత బండ్ల గణేష్. ఇద్దరం కలిసి 40 నుండి 50 సినిమాలు చేశామని…25 ఏళ్ల సాన్నిహిత్యం తమనదని, ఎన్నో రోజుల పాటు చాలా దేశాలు కలిసి ప్రయాణించామని అన్నారు. ఒకే రూంలో ఉంటూ… వందల వేల సార్లు కలసి బోజనం చేశామని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసి… ఇటీవలే ఇంటికి వెళ్లి కలిసి వచ్చా. ఆరోగ్యం జాగ్రత్త అంటే నాకేం కాదు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు వేణు మాదవే అన్నీ అని, ఈ విపత్తును ఆయన కుటుంబ సభ్యులు దైర్యంగా ఎదుర్కొవాలని కోరారు. వారికి మంచి భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
Tolivelugu Latest Telugu Breaking News » వీడియోలు » వేణు మాధవ్ మృతిపై బండ్ల గణేష్ స్పందన | Bandla Ganesh Shares His Memories With Venu Madhav