పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన థియేటర్స్లో రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు.
అయితే ఈ సినిమా చూసిన చాలా మంది అభిమానులు సినీ స్టార్స్ సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ ట్వీట్ లు చేస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే బండ్ల గణేష్ కూడా ట్వీట్ చేశారు. మా దేవర నటించిన భీమ్లా నాయక్ దెబ్బకి బాక్సులు బద్దలవ్వాలని రికార్డులు చిరిగిపోవాలని దిక్కులు పిక్కటిల్లేలా అభిమానులు స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…చరిత్ర కోసం మీరు కాదు. మీ కోసం చరిత్ర దేవర అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ఈ చిత్రంలో రానా కూడా నటించారు.త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు.