సుదీర్ఘ విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరమీద కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఆ వార్త తెలియగానే పవన్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. పవన్ కు చాలా మంది ఫాన్స్ ఉంటారు. అందులో ఒకరు బండ్ల గణేష్. పవన్ పై బండ్ల గణేష్ కు ఉన్నఅభిమానం ఎలాంటిడో పెద్దగా చెప్పనవరసం లేదు. తనని నిర్మాతగా నిలిబెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, తనకి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క పవన్ కళ్యాణే అంటూ ఎన్నో సార్లు బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. తాజాగా మరో సారి బండ్ల గణేష్ తన దేవుడిపై పొగడ్తల వర్షం కురిపించారు.
బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమా రీమేక్ లో పవన్ నటిస్తున్నారు. దానితో పాటు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో కూడా మరో సినిమాకి ఒకే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే పింక్ సినిమా టైటిల్ ను వకీల్ సాబ్ గా ఇప్పటికే రిజిస్టర్ చేయించుకున్నారు. ఇప్పటివరకు గడ్డంతో ఉన్న పవన్ ఇప్పుడు గడ్డం తీసేసి న్యూ లుక్ లోకి వచ్చారు. ఆ ఫోటోలను బండ్ల గణేష్ పోస్ట్ చేస్తూ దేవుడిని అడగకూడదు తప్పు..కోరుకోవాలి అప్పుడే కోరిక తీరుతుందంటూ ట్వీట్ చేశాడు. కళ్ళల్లో కసి ముక్కు మీద పౌరుషం మీసం లో నిజాయితీ నీ సొంతం బాస్ అంటూ మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లతో మరో సారి పవన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు బండ్ల గణేష్.