వైసీపీ నుంచి బెజవాడ ఎంపీగా పోటీచేసిన సినీ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్ నుంచి సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌కు థ్రెట్ వుందా..? ఏపీ సీయం జగన్ పేరు చెప్పి ఇండస్ట్రీలో అందర్నీ పీవీపీ బెదిరిస్తున్నాడా? బడా పారిశ్రామికవేత్తగా వున్న పీవీపీ నుంచి తనకు ప్రాణహానీ వుందని బండ్ల గణేశ్ చేసిన తాజా ట్వీట్లు సినీ, రాజకీయ వర్గాలలో సంచలనంగా మారాయి.
హైదరాబాద్: తనకు సినీ నిర్మాత, వైసీపీ నేత పీవీపీ నుంచి ప్రాణహానీ వుందని మరో నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఆరోపిస్తున్నాడు. ఓడిపోయిన కేసులకు కూడా డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నాడని, అన్నింటికీ జగన్ పేరు వాడుకుంటున్నాడని ట్విటర్ వేదికగా బండ్ల గణేశ్ చేసిన కామెంట్లు కలకలం సృష్టిస్తున్నాయి. అతను ఏమన్నాడంటే..
‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ గారికి.. సార్! మమ్మల్ని అందరినీ పివీపీ బారి నుంచి కాపాడండి. అందరూ ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి లేని పాలన జరుగుతుందని ఆనంద పడుతూ ఉంటే, తులసివనంలో గంజాయి మొక్కలా వీరు మీ పార్టీకి, నీకు చెడ్డ పేరు తెస్తున్నారు. ఓడిపోయిన కేసులు కూడా మళ్లీ డబ్బులు కావాలి అని బెదిరించి, మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ నా చేతుల్లో ఉంది, మీ అందర్నీ చంపేస్తాను అని అంటున్నాడు. రాజన్న రాజ్యం వచ్చిందని ఆనందంతో బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇలాంటి దుర్మార్గుడి చేతి నుంచి కాపాడండి. మీ పేరు చెప్పి చిత్ర పరిశ్రమలో అందర్నీ బెదిరిస్తున్నారు. దయచేసి కట్టడి చేయండి’. ఇదీ గణేశ్ చేసిన కామెంట్స్.
ఇలావుంటే, పీవీపీ నిన్న అర్దరాత్రి హైదరాబాద్‌లో పీవీపీ ఇంట్లో బండ్ల గణేష్ హల్చల్ చేశాడంటూ ఒక వర్గం వాట్సాప్‌లో ఒక న్యూస్ వైరల్ చేసింది. టెంపర్ సినిమాకు పీవీపీ 7 కోట్ల ఫైనాన్స్ చేశారని, కొంతకాలంగా బండ్ల గణేష్‌ని డబ్బులు అడుగుతున్న పీవీపీని నిన్న అర్థరాత్రి దాటాక బండ్ల గణేష్ మనుషులు బెదిరించారని ఈ వార్త సారాంశం. పీవీపీని బెదిరించడంపై బండ్ల గణేష్ మనుషుల మీద జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారని కూడా వార్త వచ్చింది.
గౌరవనీయులైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ గారికి సార్ మమ్మల్ని అందరినీ పి వి పి బారి నుంచి కాపాడండి @YSRCParty @AndharaCMO
— BANDLA GANESH (@ganeshbandla) October 5, 2019