కరోనా సెకండ్ వేవ్ అన్ని రాష్ట్రాలను వణికిస్తుంది. కేసులు ఒక్కసారిగా పెరిగిపోతున్నందున కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు నగరంలో ఏప్రిల్ 7 నుంచి 144 సెక్షన్‌ను విధించింది. కర్ణాటకలో ఉన్న కేసుల దృష్ట్యా 144 సెక్షన్‌తో పాటు.. అపార్ట్‌మెంట్లు, నివాస సముదాయాల్లోని స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్, పార్టీ హాళ్లను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు 6వేల నుండి 7వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇందులో ఒక్క బెంగుళూరు నగరంలోనే 4వేల పైచిలుకు కేసులుంటున్నాయి. పైగా మరణాల సంఖ్య ప్రతిరోజు 25కు పైగానే నమోదవుతుంది. దీంతో బెంగుళూరులో మరిన్ని ఆంక్షలకు రెడీ అయ్యారు.
ఆ రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 50వేల యాక్టివ్ కేసులున్నాయి. అలాగని లాక్ డౌన్ పెట్టే పరిస్థితి లేకపోవటంతో ప్రభుత్వం ఇప్పటికే విద్యా సంస్థలను మూసివేసింది. వీకెండ్ లాక్ డౌన్ పై సీరియస్ గా ఆలోచిస్తున్నామని ఆరోగ్యమంత్రి సురేష్ ప్రకటించారు.