జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన బంగార్రాజు చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రం మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో తో కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లను సాధించింది.
ఇక ఈ చిత్రం ఐదు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే సీడెడ్‌లో రూ.5.65 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.4.01 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.29 కోట్లు,
వెస్ట్ గోదావరిలో రూ. 2.41 కోట్లు,
గుంటూరులో రూ.2.91 కోట్లు, కృష్ణాలో రూ. 1.88 కోట్లు, నెల్లూరులో రూ1.46 కోట్లు వసూలు చేసింది. మొత్తం 5 రోజుల్లో రూ. 29.06 కోట్లు షేర్, రూ. 46.90 కోట్లు గ్రాస్ సాధించింది.
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున నాగచైతన్య హీరోలుగా నటించగా రమ్యకృష్ణ కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించారు. బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
అలాగే ఫరియా అబ్దుల్లా స్పెషల్ సాంగ్ లో నటించారు. ఇక అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఇక ఈ చిత్రం గతంలో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే.