కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం బంగార్రాజు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇందులో కృతి శెట్టి, రమ్యకృష్ణ లు హీరోయిన్స్ గా నటించారు.
వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఏకంగా మూడు రోజుల్లోనే 53 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఈ మేరకు మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. అయితే గతంలో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.