కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా జనవరి 14న వచ్చిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బంగార్రాజు. ఫ్యామిలీ కామెడీ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.
ఇక తాజాగా ఈ సినిమా ఎనిమిది రోజుల కలెక్షన్స్ బయటకు వచ్చాయి. నైజాంలో రూ. 7.67 కోట్లు,సీడెడ్‌లో రూ. 6.01 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.47 కోట్లు, ఈస్ట్ గోదావరి లో రూ. 3.61 కోట్లు,వెస్ట్ గోదావరిలో రూ. 2.58 కోట్లు,గుంటూరులో రూ. 3.07 కోట్లు, కృష్ణాలో రూ. 1.98 కోట్లు,నెల్లూరులో రూ. 1.55 కోట్ల రూపాయలను రాబెట్టింది.
మొత్తం 8 రోజుల్లో రూ. 30.94 కోట్లు షేర్, రూ. 50.02 కోట్లు గ్రాస్ సాధించింది. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి, రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిం చారు. వెన్నెల కిషోర్, ఝాన్సీ కీలక పాత్రల్లో నటించారు.
ఫరియా అబ్దుల్లా స్పెషల్ సాంగ్ లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.