కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నాగచైతన్య హీరోలుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం బంగార్రాజు. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన ఈ చిత్రంలో కృతి శెట్టి, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటించారు. రావు రమేష్, వెన్నెల కిషోర్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే…
నైజాం లో బంగార్రాజు మొదటి రోజు 3.1 కోట్ల గ్రాస్ మరియు 1.73 కోట్ల షేర్ ని రాబట్టాడు.ఇది ఈ చిత్రానికి మంచి స్టార్టింగ్ అనే చెప్పాలి.
పండుగ సీజన్ అవ్వటం, పెద్ద సినిమాలు లేకపోవటం మరింత ప్లస్ అనే చెప్పాలి. రాబోయే షో లకు ఈ వసూళ్లు మరింత ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక గతంలో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ లు హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం నాగార్జున కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.