కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బంగార్రాజు. ఈ సినిమాలో రమ్యకృష్ణ , కృతి శెట్టి లు హీరోయిన్స్ గా నటించారు. గతంలో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది.
సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే గడిచిన 2రోజుల్లో 36 కోట్లు వసూలు చేసింది.
నైజాంలో రూ. 4.47 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.46 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.20 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.75 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.39 కోట్లు, గుంటూరులో రూ. 1.79 కోట్లు, కృష్ణాలో రూ. 93 లక్షలు, నెల్లూరులో రూ. 86 లక్షలు సాధించింది.