కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం బంగార్రాజు. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతి శెట్టి లు హీరోయిన్స్ గా నటించారు.
అలాగే వెన్నెల కిషోర్, సంపత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 36 కోట్ల షేర్ ని క్రాస్ చేసిందట.
ఇక నాగచైతన్య మరోవైపు థాంక్యూ సినిమా చేస్తున్నాడు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీ కన్నా, అవికా గోర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.