కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బంగార్రాజు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం లో రమ్య కృష్ణ, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించారు.
ఇకపోతే ఈ చిత్రం రిలీజ్ అయ్యి 20 రోజుల అవుతుంది. కాగా ఈ 20 రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ చూసుకుంటే…
నైజాంలో రూ. 8.30 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.85 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.21 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.14 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.90 కోట్లు, గుంటూరులో రూ. 3.44 కోట్లు, కృష్ణాలో రూ. 2.25 కోట్లు, నెల్లూరులో రూ. 1.75 కోట్లతో.. రూ. 34.84 కోట్లు షేర్, రూ. 56.63 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.
ఇక ఈ చిత్రం గతంలో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కింది.