కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బంగార్రాజు. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది.ఇందులో రమ్య కృష్ణ, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించారు.
ఈ చిత్రం రిలీజ్ అయ్యి… 25 రోజులు అవుతుండగా ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ కి సిద్దం అవుతుంది. ఈ నెల 18వ తేదీ నుంచి జీ 5లో ఈ సినిమాను స్ట్రీమింగ్ కాబోతోంది.
ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది. అన్నపూర్ణ బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే.
గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం నాగచైతన్య థాంక్యూ సినిమా చూస్తున్నాడు.