నెం.1 ఆల్ రౌండర్ గా ఉండి, ఏడాది పాటు అంతర్జాతీయ మ్యాచులు ఆడకుండా నిషేధం ఉన్న బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబుల్ హాసన్ రిక్వెస్ట్ కు బంగ్లా బోర్డ్ షాకయ్యింది. త్వరలో పునరాగమనం చేస్తున్న షకీబ్… ఐపీఎల్ కు అందుబాటులో ఉండేందుకు అనుమతి ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేసుకున్నాడు.
దీనిపై బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల హాసన్ అసహనం వ్యక్తం చేశాడు. తన దేశానికి ఆడకుండా… డబ్బులొచ్చే ఐపీఎల్ ఆడేందుకు అనుమతి కోరటంపై మండిపడ్డాడు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని… ప్రతి ఒక్క ఆటగాడు ఇలాగే అడిగితే అప్పుడేం చేయాలంటూ ప్రశ్నించారు.
ఐపీఎల్ సమయంలోనే బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల మధ్య మ్యాచులు ఉండే అవకాశం ఉంది. దీంతో కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు… అవసరం అయితే ఆటగాళ్లతో కొత్త కాంట్రాక్ట్ చేసుకోవాలని నిర్ణయించింది. ఆటగాళ్లు ముందుగానే తాము ఏ సిరీస్ లకు అందుబాటులో ఉంటారో లేదో చెప్పాలని కండిషన్ పెట్టనుంది.