బంగ్లాదేశ్ క్రికెటర్ సైఫ్ హసన్ ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ ఆడడానికి కోల్ కతా వచ్చాడు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో తమ టీమ్ ఓడిపోవడంతో వారితో పాటే ఇక్కడే ఉన్నాడు. సోమవారం బంగ్లాదేశ్ కు వెళ్లడానికి అందరికి ప్లయిట్ టిక్కెట్లు బుక్కయ్యాయి. అందరితో పాటు సోమవారం ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన సైఫ్ హసన్ కు ఊహించని అనుభవం ఎదురైంది. అతని వీసా గడువు అప్పటికే ముగియడంతో అధికారులు అతను ఇండియా వదిలి వెళ్లడానికి నిరాకరించారు. ఆరు నెలల క్రితం తీసిన సైఫ్ వీసా అతని ప్రయాణించడానికి రెండు రోజుల ముందే ముగిసింది. ఈ విషయాన్ని సైఫ్ గమనించలేదు. వీసా గడువు ముగియడంతో రూ.21,600 చెల్లించి ఎగ్జిట్ పాస్ తీసుకుంటే తప్ప దేశం విడిచి వెళ్లడానికి అవకాశం లేదన్నారు ఎయిర్ పోర్ట్ అధికారులు. దీంతో రెండు రోజులు ఇక్కడే ఉండి ఫెనాల్టీ చెల్లించి ఎగ్జిట్ పాస్ తీసుకొని ఆలస్యంగా బంగ్లాదేశ్ వెళ్లిపోయాడు. తన వీసా ప్రాసెస్ తొందరగా చేసిన ఇండియా పాస్ పోర్ట్ అధికారులకు సైఫ్ కృతజ్ఞతలు తెలిపాడు.