ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మోడీ 99వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఆమె జన్మదినం సందర్బంగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమిన్ ప్రత్యేక పుష్పాగుచ్చాన్ని పంపించారు.
ఆమె నూరవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆమెకు 100 గులాబీలను మోమిన్ పంపారు. ఈ పుష్ప గుచ్చాన్ని బంగ్లాదేశ్ రాయబారి ఆమెకు తన నివాసంలో అందజేశారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ పత్రిక ట్రిబ్యూన్ వెల్లడించింది.
‘ భారత ప్రధాని మోడీ తల్లి మీరాబెన్ మోడీకి 100వ జన్మదిన శుభాకాంక్షలు. ఆమె చిరకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను ’అని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
తన తల్లి 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆమె ఆశీర్వాదాన్ని తీసుకున్నట్లు మోడీ శనివారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తన తల్లికి అంకితం చేస్తూ ఓ బ్లాగ్ రాశారు. అమ్మ అంటే ఒక్క పదం కాదని..ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నదని మాతృమూర్తి గొప్పతనాన్ని వివరించారు.