కర్ణాటక రాజధాని బెంగళూరులోని బొమ్మనహళ్లిలోని ఒ అపార్ట్‌మెంట్ లో ఏకంగా 103 మందికి కరోనా వైరస్ పాజిటివ్ రావటంతో అంతా ఉలిక్కి పడ్డారు. బొమ్మనహళ్లిలోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఫిబ్రవరి 4న జరిగిన ఓ పార్టీలో 1,052 మంది పాల్గొన్నారు. వారిలో 103 మందికి కోవిడ్ -19 పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. ఒక వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు.
మిగిలిన వారంతా క్వారంటైన్‌లో ఉన్నారని బీబీఎంపీ కమిషనర్ మంజునాథ ప్రసాద్ చెప్పారు. కొన్ని రోజులుగా మెట్రో సిటీస్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు కోవిడ్ నిబంధనలను గాలికొదిలేయటం, కేసులు తగ్గుతున్నాయన్న అభిప్రాయంతో ఉండటంతో కేసులు పెరుగుతున్నట్లు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.