సీటు బెల్ట్ పెట్టుకోండి.. లేకపోతే పోతారు అని ఎంతగా అవగాహన కల్పించినా జనాల్లో మార్పు రావడం లేదు. బెంగళూరులో జరిగిన యాక్సిడెంట్ లో ఏడుగురు చనిపోవడానికి కారణం సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమేనని తేల్చారు పోలీసులు.
బెంగుళూరులోని కోరమంగళ్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన డీఎంకే ఎమ్మెల్యే ప్రకాశ్ కుమారుడు కరుణ సాగర్ అతని భార్య సహా ఏడుగురు చనిపోయారు. స్పాట్ లోనే ఆరుగురు మృతి చెందగా ఆస్పత్రికి తరలిస్తుండగా ఇంకొకరు చనిపోయారు. ఎవరూ సీటు బెల్ట్ ధరించలేదని.. అందుకే ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకోలేదని వివరించారు.
ప్రమాదం జరిగిన సమయంలో కారు వంద కిలోమీటర్ల వేగంతో వెళుతోందని గుర్తించారు పోలీసులు. కరుణ సాగర్ డ్రైవింగ్ చేస్తున్నట్లుగా చెప్పారు. సీటు బెల్టు పెట్టుకొని ఉన్నట్లయితే ప్రాణాలు దక్కుండేవని తెలిపారు.